ఈ మధ్య నా శ్రీమతి రంగుల మాయా బజార్ చూద్దాం అనింది. ఓకే అన్నాను. సినిమా కూడ ఓకే అనిపించింది. కొన్ని పాటలు, సన్నివేశాలు, పద్యాలు తీసేసారు. ముఖ్యంగా "భలి భలి భలి భలి దేవ" అని సాగే పాట. ఘటోత్కచుని రాక ముందు ఉండే హాస్య సన్నివేశం, ఒకటి రెందు పద్యాలు కూడ కత్తిరించారు. సినిమా చూస్తున్నపుడు ఎంతో advanced technology అప్పటి నుంచే ఉందనిపించింది. నా ఉద్దేష్యం Marcus Bartley పుణ్యమా అని కాదు,మహాభారత కాలం నాటి సంగతి. ఉదాహరణకి
సత్య పీఠం: బహుషా, narco analysis దీని ముందు ఎందుకూ పనికిరాదు.
ప్రియ దర్శిని: (అదే నండి,శశిరేఖ ఇందులో తన బావను చూసుకుని మురిసిపోతుందే,అది): Skype దీని ముందు దిగదుడుపే కదా!
ఆభిమన్యుడు సుభద్ర అడవిలో ప్రయాణం చేస్తుండగా ఘటోత్కచునికి తెలియడం: Highly sensitive sensor mechanism transmitting the signal and activating a device, పరకాయ ప్రవేశము మరియు miniaturization. ఇంకా ఎన్నో అధ్భుతాలు!
నా దృష్టికి వచ్చిన పొరపాటు: లక్ష్మణ కుమారున్ని చూపించినపుడు "సమయానికి తగు మాటలాడెనె" అనే పాటను అనుకరిస్తాడు. అది ఆ సమయానికి తగు పాట కాదేమో అనిపించింది. ఎందుకంటే ఇది త్యాగరాజ స్వామి కృతి కదా!
మొత్తానికి రంగు మారినా,రుచి మరియు చిక్కదనం ఏ మాత్రం మారలేదు నాగి రెడ్డి పుణ్యమా అని.
ఇంత కంటే పొట్టి కిర్కీట్ ఉండదోచ్!
2 weeks ago
Very good beginning.
ReplyDeleteBest of luck and all good wishes.
Hari,
ReplyDeleteGood attempt. (There are some basic mistakes in Telugu that probably would disappear as you get more comfortable in typing Telugu with QWERTY English keyboard.)
Also, add your blog to koodali.org. That will make your blog visible to a large number of Telugu readers and bring you more audience.
-Murali