అదేంటో, తెల్లవారుతున్న కొద్దీ నిద్ర ఎక్కువౌతుంది. నిద్ర లేవడానికి ఇంకా 15 నిముషాలు ఉండగా, "కౌసల్యా సుప్రజా రామా.." అని సుబ్బలక్ష్మి ఎంతో మధురంగా పాడిన పాట వినిపించింది. ఆహా,ఇంత ప్రాచుర్యం పొందిన పాటను పాడిన సుబ్బలక్ష్మి జీవితం ధన్యం కదా అని అనుకుంటుండగా, నా మదిలో ఒక ప్రశ్న మొలకెత్తింది. లక్షలాది మందిని సుప్రభాతంతో నిద్రలేపే సుబ్బలక్ష్మి ఎవరి పాటతో నిద్ర లేచేవారో అని? ఆలోచించడం మొదలెట్టాను. నా శ్రీమతిని అదే అడిగాను.
ఏమండీ!, సుబ్బలక్ష్మి సంగతి అటుంచండి, ఇంకొక పావు గంటలో current పోతుంది, ఆ తరువాత స్నానానికి నీళ్ళు ఉండవు, ఆపై మీ ఇష్టం అన్న మా ఆవిడ మాటలు నా ఆలోచనలకు అడ్డుకట్ట వేశాయి.
ఆపరేషన్ బనియన్ ఎండ్ చెడ్డి
6 months ago
chinna navvu techchenu mee teta tene velugu - mee blagu mahu bagu!
ReplyDeleteహరి,
ReplyDeleteశైలి చాలా బాగుంది. కథా వేగం, pace of the story కూడా సరిపోయింది. రింగ రింగ విని రంగ రంగ అనుకోవడం బాగా పండింది.
Keep writing.